Telugu News Power

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పెద గోపురం ధర్మకర్తలమండలి సమావేశం

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం, పాలు, ఉచిత ప్రసాదాలు అందించడం పై చర్చించారు. శివరాత్రికి, స్వామివారి ఆలయాన్ని పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాలని తీర్మానించారు. స్వామివారి కల్యాణోత్సవం మార్చి, 25 నా అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. భక్తుల ప్రోత్సాహంతో ఈ ఏడాది తొలిసారి ప్రభల ఉత్సవం ప్రారంభించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, ఆలయ అర్చకులు, క్రిష్టప్ప, అనిల్ కుమార్,సోమేశ్వర రావు, వీరబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అర్చకులు నివాళి.
స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ అర్చకులు రఘు బాబు గారి మరణ వార్తతో సమావేశం లో సభ్యులు,నిర్గాంతపోయారు. వారి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ, సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.