Telugu News Power

శీతాకాలం టిబి తో జాగ్రత్త

టి బి బాధితులకు సహాయం అందిస్తున్న డాక్టర్ రాజు.

పాలకొల్లు:డిసెంబర్,9(తెలుగు న్యూస్ పవర్) టీవీ మందులు తీసుకునేవారు శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని లంకల కోడేరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నవ్య జీవన్ కోరారు. క్షయ వ్యాధి విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ పాలకొల్లు అధ్యక్షులు, నిక్షయమిత్ర డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, రోటరీ క్లబ్ సభ్యులు 20 మందికి టీబీ మందులు, పోషకాహారం కిట్లు అందజేశారు. శీతాకాలంలో చలికి బయట తిరగరాదని, క్రమం తప్పకుండా మందులు వాడితే త్వరలో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్ నవ్య జీవన్ తెలిపారు. టి.బి రోగులను గుర్తించడానికి స్థానిక ఆస్పత్రిలో సౌకర్యం ఉందన్నారు. బాధితులకు మందులు ఉచితంగా ఇవ్వటంతో పాటు ప్రతి నెల వెయ్యి రూపాయల నగదు కూడా అందజేస్తారని ప్రభుత్వ వైద్యులు జీవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు వారి సిబ్బంది పాల్గొన్నారు.