Telugu News Power

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

బ్రహ్మోత్సవ ఊరేగింపులో తరలివెళుతున్న శ్రీనివాసులు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది.
స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కమిటీ గురువులు యాదంరెడ్డి సత్యం, పరువు ప్రముఖులు, గోవింద మాల భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.