పాలకొల్లు:ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనుకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు నాగబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పురవీధులలో ఏనుగు అంబారిపై అమ్మవారు ఊరేగారు. పూలచత్రాలు ఇరువైపులా బారులు తీరగా, గరగ నృత్యాలు, బేతాళ నృత్యాలు, మ్యూజికల్ బ్యాండ్ బృందాలను అనుసరించి రథోత్సవం సాగింది. భక్తులు శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహ దర్శనం అందుకున్నారు. ఊరేగింపులో బాణా సంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదపండితులు బలిహరణ అమ్మవారికి విశేష కుమార్చన పూజల్లో గుణ్ణం నాగబాబు రాజరాజేశ్వరి దంపతులు, గుణ్ణం మణికంఠ సుభాష్,విజయ దీప్తి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు, కార్యనిర్వహణాధికారి ఎన్ సతీష్ కుమార్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు.

