Telugu News Power

శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగమే.

మాంగల్య ధారణ మహోత్స కమనీయ దృశ్యం

జనరల్ డెస్క్: మార్చి ,27 (తెలుగు న్యూస్ పవర్. కాం) పది కొంపలు లేని పల్లెనందైన శ్రీ రామాలయం తప్పక ఉంటుందని ప్రతీతి. శ్రీ సీతారాముల కళ్యాణం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలం, శ్రీ సీతారామ కళ్యాణం,తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ తదితరులు వీక్షించి ధరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన సొంత నియోజకవర్గంలో పాలకొల్లులో పలు రామాలయాల్లో రామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రామకృష్ణంరాజు ఆకివీడు, పెదపేటలోని రామాలయానికి భక్తులతో వెళ్లి పోలీసుల రక్షణలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం ఇక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది ఈ ఘర్షవర్ గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో వారి సతీమణి భువనేశ్వరి కుప్పంలో జరిగిన కల్యాణోత్సవంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, వారి స్వగ్రామంలో రామాలయంలో జరిగిన పాల్గొన్నారు. యానం ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ రామాలయంలో జరిగిన కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.

రాములలోరి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, సహచరులు
పాలకొల్లు గజపతిరాయ్ పేట శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు.
పాలకొల్లు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన శ్రీ రామ ఉత్సవాల్లో
రమణ గురు స్వామిని సత్కరిస్తున్న భక్తులు సత్కరిస్తున్న భక్తులు
కొప్పు రామాలయంలో పూజలు నిర్వహిస్తున్న నారా భువనేశ్వరి
యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్
భద్రత సిబ్బంది సాయంతో ఆలయం లోకి ప్రవేశిస్తున్న, ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు