
ఏడాదిగా ఎదురుచూసిన పండగ, తనదైన ముద్ర వేసి వెళ్ళిపోయింది. ఈ ఏడాది, జన్ జడ్, యువత 80శాతం, సంక్రాంతి సంబరాల వద్ద కనిపించారు. సరదా కోసం జూద క్రీడలు ఆడారు. బరి బయట కోడిపందాలు కాశారు. డాన్సులు ఎంజాయ్ చేశారు. ఈ పండుగలో 60 ఏళ్లు పైబడినవారు తక్కువగానే కనిపించారు. వారికి నచ్చే కళాప్రదర్శన లేవి లేవు. , పెద్ద జెయింట్ వీల్, బుల్లి కార్లు ఎక్కి, చిన్న పెద్ద ఆనందించారు. కొన్నిచోట్ల మ్యూజికల్ నైట్ తో, కొన్ని చోట్ల డాన్సులతో వినోదం కలిగించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, చక్కటి ఆతిథ్యం అందుకొని, కోడిపందాలు ఆడారు. రంగవల్లులతో తీర్చిన వీధులు, అతిధులను ఆహ్వానించాయి.ఉదయం అల్పాహారం దగ్గర్నుంచి, సాయంత్రం స్నాక్స్ వరకు ఉచితంగా అందడంతో, చుట్టాలతాకిడి, స్థానికులు తట్టుకోగలుగుతున్నారు. వందల సంఖ్యలో వస్తారనుకుంటే, వేల సంఖ్యలో వచ్చి పడేసరికి, లక్షల్లో ఖర్చు అయింది. కొందరికి లక్షల్లో నష్టమే మిగిలింది. ఆయా గ్రామాల మూలాలు ఉన్న ఎందరో, పిల్లాపాపలతో తరలిరావడం, ఓహో, మీరా అనుకోవడం ఓ వింత అనుభూతి. సంప్రదాయ వస్త్రధారణ, మోడరన్ డ్రెస్ రెండిటిలో యువతులు తరలివచ్చారు. తమ జ్ఞాపకాలు ఫోటోల్లో బంధించారు. పనిలో పనిగా క్షీరా రామలింగేశ్వర స్వామిని, ఇటు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని,పండక్కు వచ్చినవారు దర్శించుకున్నారు.ఈ సంక్రాంతి ఎందరికో ఉపాధి కల్పించింది. వేదికల ఏర్పాటు, భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, పిండి వంటల తయారీ, ఈవెంట్స్ నిర్వాహకులు, లైటింగ్ అండ్ మైక్ సెట్, మంచినీటి సరఫరా, వంటల తయారీ కొద్దిరోజులు పాటు ఉపాధి దొరికింది. ఏ పండుగన్న, విందులో మందు లేనిదే తాగుబోతులకు మజా రాదు. 16-17 ఏళ్ల పిల్లలు కూడా తాగి,జనం మీద తూలి పడుతూ, సారీలు చెబుతూ, ఫుల్ జోష్ లో చిందులు వేసారు. గత ఏడాది జమా ఖర్చుల్లో, ఒక ప్రభుత్వ శాఖకు చెందిన వారికి 5లక్షలు, మరో శాఖకు 60వేలు చెల్లించినట్టు చూపారు. ఒక శాఖకు అంత మొత్తం చెల్లించడం పట్ల చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మీయ పలకరింపులు, అతిధి మర్యాదలు అందుకొని, శుక్రవారం సాయంత్రం నుంచి కార్లు బార్లు తీరి, తిరుగు మొఖం పట్టాయి. మళ్లీ ఏడాది రావాలనే బలమైన కోరికతో, పల్లె నుంచి వెళ్లలేక, బలవంతంగా కార్య స్థానాలు వైపు కదలి వెళ్లారు.
