రాజోలు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) దిండి – చించినాడ గోదావరిపై నది పై నిర్మించిన వంతెన, ఉభయ గోదావరి లను కలుపుతూ 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. సఖినేటిపల్లి మీదుగా 216 జాతీయ రహదారి కలపటానికి, సుప్రీంకోర్టులో కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇంతకాలం,ఇందువల్ల జాతీయ రహదారికి అడుగు ముందుకు పడలేదు. రాజులు నియోజకవర్గ అభివృద్ధికి 216 జాతీయ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఈ కేసులో, రాజోలు జనసేన, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చేసిన కృషిని ప్రజలు అభినందించారు.
సఖినేటిపల్లి నుంచి జాతీయ రహదారి 216.