నర్సాపురం: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు,నరసాపురం ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుందని, స్థానిక లోక్సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే, విప్ బొమ్మిడి నాయకర్ తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. చించినాడ- దిండి, వశిష్ట వారధికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారి 216, విస్తరణ సంబంధించి భూసేకరణ విషయంలో, భూస్వాములు న్యాయం కోరుతూ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు, వారి వాదనను కొట్టివేస్తూ, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించారు, ఇప్పుడు, జాతీయ రహదారి 216 విస్తరణకు మార్గం సుగమమం అయింది. ఈ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోయే విధంగా, అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని ఎంపి తెలిపారు. మెరుగైన రవాణా సౌకర్యం, ఉన్న ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తన పార్లమెంటు స్థానం పరిధిలోగల పెండింగ్ లో ఉన్న అన్ని రవాణా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రవేశపెట్టిన బడ్జెట్, వికసిత్ భారతివైపు భారత్ 2047వైపు పరుగులు తీస్తుందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు, నర్సాపురానికి బంగారు భవిష్యత్తు – ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.
పత్రికా సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎంపీ ఎమ్మెల్యే లు, వర్మ, నాయకర్.