పాలకొల్లు, తెలుగు న్యూస్ పవర్: పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న టెన్నీస్ పోటీలు బుధవారం క్వార్టర్ ఫైనల్ దశ పూర్తి చేరుకొన్నాయి. చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు ఈ నెల 8న ప్రారంభమయ్యాయి. నరసాపురంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఉన్న రెండు కోర్టులలోను, పాలకొల్లు టౌన్ హాల్ కోర్టులోను, కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోర్టులోను సింగిల్స్ డబల్ విభాగాలలో క్వార్టర్ ఫైనల్ పోటీలు నువ్వానేనా అన్నట్టు హోరాహోరీగా జరిగాయి. ఈ నెల 12న గురువారం సెమీ ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఫైనల్ పోటీలు ఈ నెల 14న వివిధ వయో కేటగిరిల్లో జరుగుతాయి. అనంతరం బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ గొట్టిముక్కల బాలరాజు విలేకర్లకు తెలిపారు. బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గొట్టముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన, ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం టిడిపి ఇన్చార్జ్ పోత్తూరు రామరాజు, పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ ఇతర ప్రముఖులు పాల్గొంటారన్నారు. 8 నుంచి జరుగుతున్న సిహెచ్ బుద్ధ అవతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు బుధవారం నరసాపురంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఉన్న రెండు కోర్టులలోను, పాలకొల్లు టౌన్ హాల్ కోర్టులోను, కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోర్టులోను సింగిల్స్ డబల్ విభాగాలలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లులు ముమ్మరంగా జరిగినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ గొట్టిముక్కల బాలరాజు విలేకర్లకు తెలిపారు. గురువారం సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని, శుక్రవారం 45 55 65 70 విభాగాలలో ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని అనంతరం బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సవరణలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గొట్టముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన, ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు, టీడీపీ నరసాపురం ఇంచార్జి పొత్తూరి రామ రాజు, ఏ ఎం సీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్ తదితర ముఖ్య అతిధులు పాల్గొంటారన్నారు.
సెమీస్ కు చేరిన టెన్నిస్ పోటీలు