పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలపలేదని తేల్చిందన్నారు. మీరు చేసిన దుర్మార్గపు ప్రచారానికి, పాప పరిహార పూజ నిర్వహిహించి నట్టు గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎడ్ల తాతాజీ, చెల్లెమ్మ ఆనంద ప్రకాష్, వైఎస్ఆర్సిపి,రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కర్ర జయసరిత, ఉచ్చుల స్టాలిన్ బాబు, కోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.