వీరవాసరం: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్యాప్టో ఆధ్వర్యంలో వీరవాసరం 10వ తరగతి స్పాట్ కేంద్రం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం స్పాట్ వాల్యూషన్ విధానం ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి ఆరోపించారు. డబ్బులలో నమోదు వల్ల సమస్యలు ఎదురై, పని పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రస్తుతం రెండవ దశలో స్పాట్ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతున్నట్టు తెలిపారు. 25 నుంచి 27 వరకు విజయవాడలో రిలే నిరాహార దీక్ష ఉద్యమం చేపడుతామని విజయరాజు వెల్లడించారు. వెంటనే పిఆర్సి నూతన కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి 30 శాతం చెల్లించాలని కోరారు. 11 పి ఆర్ సి బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి లంకపల్లి సాయి శ్రీనివాస్, ఏపీ జెఎసి,యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్, పలువురు ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు.
స్పాట్ కేంద్రం వద్ద ఫ్యాప్టో నిరసన