కాకినాడ: ఏప్రిల్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) హరేంధిర ప్రసాద్ కాకినాడ కొత్త కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ఆర్డీవో ఎస్ మల్లిబాబు, కమిషనర్ సత్యనారాయణ, డిఆర్ఓ తిప్పే నాయక్ తదితర అధికారులు కొత్త కలెక్టర్ కు స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా పరిస్థితులపై తనకు అవగాహన ఉందని, పూర్తి ప్రభుత్వ సమాచారం సేకరించి ముందుకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల సహాయసహకారాలతో కాకినాడను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపటానికి కృషి చేస్తానన్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించటానికి ముందు, అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు.
హరేంధిర ప్రసాద్ కాకినాడ కొత్త కలెక్టర్.
కాకినాడ నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ