నర్సాపురం, డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు ఆకా సత్యనారాయణ తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నరసాపురం లేస్ పార్కు బుధవారం సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ముగింపు రోజున మంత్రి హాజరయ్యారు. మహిళలకు ఎంతో సహనం, సృజనాత్మకత ఉందని, వారు తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా కనపడుతుంది అన్నారు. ఈ విధంగా మహిళలు పురోగమించడానికి, సమాజానికి ఉపయోగపడటానికి ఇలాంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయి అన్నారు. ఈ పర్యటన రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కలవకొలను తులసి రావు, టిడిపి ఇన్చార్జ్, పోత్తూరు రామరాజు, లేస్ పార్క్ అధికారులు పాల్గొన్నారు.