Telugu News Power

ప్రభుత్వ పథకాలు పక్కా ప్రణాళికలతో అమలు చేయాలి. -ముఖ్యమంత్రి ఆదేశాలు.

అవేర్ 2.0 యాప్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కాం)

కొత్త పాఠ్య పుస్తకాలు తీసుకురావడం

కళాశాల విద్య శిక్షణ

వేగంగా ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ

విద్యుత్ తీగల ప్రమాదాల నివారణ పై

-ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష,

అవేర్ 2.0 మొబైల్ యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పథకాల కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు,సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యమూ జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయలన్నారు. టిడ్కో ఇళ్లు కాకుండా, మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆలస్యం చేయకూడదన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది కొనసాగాలన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు, ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్టు సర్వేలో తేలింద,ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా, ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇసుక ఉచితంగా ఇస్తున్న రీచుల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణ పేరుతో కానీ, ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీనిపై పటిష్ట నిఘా పెట్టాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కాలేజ్ కరిక్యులంను రీ-స్ట్రక్చర్ చేయాలని నిర్దేశించారు.

“కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్ది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీ-ఓరియేంటేషన్ చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు అధ్యయనం చేయాలన్నారు. యూనివర్శిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలన్నారు. సాంప్రదాయ కోర్సులతో పాటు,డిమాండ్ ఉన్న కోర్సులను, కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలని చూసించారు. యూనివర్శిటీల ర్యాంకింగులు కూడా మరింతగా పెరగాల్సి అవసరం ఉందన్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కానీ. విమర్శలు కానీ సహించేది లేదన్నారు. శాప్ విభాగం పనితీరు మెరుగుపడాలన్నారు. 5కే రన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజల్లో, యువతలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన కల్పించేలా శాప్ చర్యలు చేపట్టేలా శాప్ చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు.. మరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించాలి. కఠినంగా నిబంధనలు అమలు చేయడానికంటే ముందు… ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ నిబంధనలు తమ కోసమేననేది ప్రజలు అర్థం చేసుకునేలా అవగాహన కల్పించాలి. విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివి ఇకపై జరగడానికి వీళ్లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం

‘పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే, ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం,అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.టెక్నాలజీని వినియోగిస్తున్నాం, కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదు, క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందినీ అప్రమత్తం చేయాలన్నారు. టవర్ లోకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని నెట్ వర్క్ ద్వారా ప్రజలకు తెలియచేసేలా చూడాలి’ అని సీఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్2.0 మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.