Telugu News Power

చాంబర్స్ కాలేజ్, పాలకొల్లు గోల్డెన్ జూబ్లీ, పెరల్ జూబ్లీ వేడుకల కర్టెన్రైజర్ ప్రోగ్రామ్

చాంబర్స్ కాలేజ్, పాలకొల్లు గోల్డెన్ జూబ్లీ, పెరల్ జూబ్లీ వేడుకల కర్టెన్రైజర్ ప్రోగ్రామ్.

Honorable minister for water resources Sri Nimmal రామానాయుడు spoke at Chambers College golden jubilee celebrations at Palakollu.

యువత శ్రమైక జీవన సౌందర్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) అందిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త,
శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. పాలకొల్లు చాంబర్స్ కాలేజీ స్వర్ణోత్సవాల్లో భాగంగా రెండో రోజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత పాఠశాల స్థాయి నుంచే తమకు ఇష్టమైన వ్యాపకం చేబట్టాలని జీవితంలో ఎదగడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఉద్బోధించారు. సమాజంలో సమస్యల పరిష్కారం చూపించాలని కోరారు. యువత రాజకీయాలు పట్ల ఆసక్తితో ఆ రంగంలోకి రావలని పిలుపునిచ్చారు.

చాంబర్స్ కాలేజీ స్వర్ణోత్సవాల్లో భాగంగా రెండో రోజు కేంద్ర భారీపరిశ్రమల శాఖామాత్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాలేజీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాజకీయలు ప్రస్తావించడానికి ఇది వేదిక కాదంటూనే, అన్యాపదేశంగా వారి తాత గారు ఆ విద్యా సంస్థ 50ఎకరాల బహూకరించారన్నారు. తమది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమన్నారు. తన దగ్గర డబ్బు లేదని ఇబ్బందులు పెట్టాలనుకున్నారని, బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినవాళ్లు గొప్పవాళ్ళా అని ప్రశ్నించారు.

చాంబర్స్ కాలేజీ స్వర్ణోత్సవాల్లో ముగింపు సభకు పూర్వ విద్యార్ధి, జిల్లా పరిషత్ పూర్వ అధ్యక్షులు, పూర్వ ఎమ్మెల్సీ, తిరుపతి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు మేక శేషుబాబు మాట్లాడుతూ, కాలేజీ ఇంత గొప్ప ప్రగతి సాధించడానికి కారణమైన పాలకవర్గాన్ని ప్రసంచించారు. లక్ష రూపాయల విరాళం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఓ పాత్రికేయులు, శేషుబాబు త్వరలోనే పార్టీ మారబోతున్నట్టు వేదికపై నుంచే ప్రకటించడంతో సభికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

చాంబర్స్ కాలేజీ భవననిర్మాణ కమిటీ సభ్యులు అడబాల వేంకట రమణ మాట్లాడుతూ కాలేజీ భవననిర్మాణ సమయంలో తన అనుభవంతో నిర్మాణవ్యయం తగ్గించ గలిగామన్నారు. ఈ సందర్భంగా లక్ష రూపాయల విరాళం ప్రకటించారు.

Photos: