
భీమవరం:డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) అంగన్వాడి ఉపాధ్యాయులకు 26 వేల రూపాయల కనీస జీతం ఇవ్వాలని పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరంలో తమ డిమాండ్ల సాధన మేరకు అంగన్వాడి ఉపాధ్యాయులు, వర్కర్లు సి ఐ టి యు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మూర్తి మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఎఫ్ ఆర్ ఎస్ యాప్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి అంగన్వాడిలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జాత నిర్వహించారు.
