Telugu News Power

అంబరాన్ని అంటిన కాస్మోకబ్ క్లబ్ టెన్నిస్ సంబరాలు

 

క్రీడాకారుల ప్రేమాభిమానాలే ఇంత వైభవంగా, భారీ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించడానికి తమకు ప్రోత్సాహం అందిస్తున్నాయని పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభ సోమవారం రాత్రి స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మూలపురుషుడు చెరుకూరి బుద్దావతారం రాజు అన్నారు. ఆపరంపర నేటికీ కొనసాగించమని వారి కుమారులు వర్మ ముందుకు రావడం వల్ల ఈ పోటీలు నిర్విఘ్నంగా
కొనసాగిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పాలకొల్లు కాస్మో క్లబ్ కల్పించే స్వేచ్ఛ వాతావరణన్ని, అతిధి మర్యాదలను ఎంతగానో ఇష్టపడతారన్నారు. కాస్మో స్పోర్ట్స్ క్లబ్ అనేక క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. అంతేకాక సేవారంగంలో కూడా ముందుంటుందన్నారు. హుద్ హుద్ తుఫాన్, బుడమేరు ముంపు వంటి విపత్తులను ఎదుర్కొనే సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో బాధితులకు సహాయ సహకారాలు అందించామన్నారు. ఈ సభలో ముఖ్య అతిధి ఆర్డిఓ దాసిరాజు మాట్లాడుతూ, చెరుకూరి బుద్దావతారమ్ రాజు గొప్ప వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. కాస్మోక్ క్లబ్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. గత నుంచి ఈ క్లబ్ తో తనకు అనుబంధం ఉందన్నారు. పాలకొల్లులో ఏ గొప్ప కార్యక్రమం జరిగిన, జరగాలన్న కాస్మోక్లబ్ పాత్ర తప్పక ఉంటుందన్నారు. పట్టణం చిన్నదైనా కూడా ఇక్కడ వారు విశాల భావాలు కలిగి ఉంటారన్నారు. ఇక్కడ ప్రజలు అన్ని రంగాల్లో రాణించే పట్టుదల గలవారన్నారు. భవిష్యత్తులో ఈ కాస్మోక్లో మరెన్నో టోర్నమెంట్లు నిర్వహించాలని ఆకాంక్షించారు. క్షత్రియ పరిషత్ పెద్దలు సూర్యనారాయణరాజు, సూరిబాబు మాట్లాడుతూ,బుద్దావతారంరాజు టెన్నిస్ క్రీడకు రారాజని కొనియాడారు. .పలువురు క్రీడాకారులు ఈ సభలో మాట్లాడుతూ టెన్నిస్ క్రీడ గతంలో ఢిల్లీ వారి కబంధహస్తాల్లో ఉండేదన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ వాతావరణంలో టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి బుద్దావతారం రాజు ఆనాడు చేసిన విశేష కృషి ఫలితమే నన్నారు. మానసిక,

శారీరక ఆరోగ్యాన్ని టెన్నిస్ ఇస్తుందన్నారు. సీనియర్స్ ఈ ఆటలు ఆడటం వల్ల యువతకు స్ఫూర్తి కలుగుతుందిన్నారు. పాఠశాల స్థాయి నుంచి టెనీస్ క్రీడ ప్రవేశపెట్టాలని, ఈ క్రీడ, యోగా అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్నారు. క్రీడాకారులు కరతాల ధ్వనుల మధ్య కాస్మో క్లబ్ ఆత్మీయ ఆతిథ్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. .ఈ సభలో సిహెచ్ శ్రీనివాసరాజు సిహెచ్ వెంకటేశ్వర వర్మ ,
ఆర్.(అజంత)సత్యనారాయణ రాజు ,వి.వి .సోమరాజు, డాక్టర్ వర్మ, ఆర్. కృష్ణంరాజు, కే .గణపతి రాజు ,ఎస్ మురళి రాజు ,డి శ్రీనివాసరాజు ,ఎంవీఎస్ రామరాజు, మెహర్ వర్మ , ఎస్వీఆర్ రాజు ,ఆర్ శ్రీనివాసరాజు، కె రామలింగరాజు వై సుబ్బరాజు،కనుమూరీ రామకృష్ణంరాజు, పి రాంబద్ర రాజు,ఐ. బాల భాస్కర్ రాజు, వివి సోమరాజు, జిఎస్వి ఎస్ ఎన్ రాజు (బూన్ రాజు) తదితరులు పాల్గొన్నారు.

టెన్నిస్ పోటీలు ప్రారంభం

సభానంతరం ఆర్డిఓ దాసిరాజు క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, పోలిశెట్టి నందన్ కుమార్, (ఆస్త)ఇన్కమ్ టాక్స్ అధికారి నాయక్, జడ్జ్ రామకృష్ణ ,ఏఎస్పి కోటేశ్వరరావు, సహదేవరావు పలువురు క్రీడాకారులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.