Telugu News Power

అంబేద్కర్ కు నివాళి

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు జరిపించారు. ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ 1,2, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ సమ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారన్నారు. అంబేద్కర్ నేటి యువతకు గొప్ప స్ఫూర్తిని కొనియాడారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ రామకృష్ణ, విజయలక్ష్మి, అర్థశాస్త్ర విభాగాధిపతి సిహెచ్ ఉషారాణి, కె పార్థసారథి,బూసి వెంకటస్వామి,జోష్ణ, హెప్సీరాణి, మన్మధరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.