Telugu News Power

అడవిపాలెం ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే

యలమంచిలి మండలం, అడివిపాలెం గ్రామంలో గురువారం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ ఎస్ ఎస్ శిబిరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి

యలమంచిలి:నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించాలని ప్రిన్సిపల్ డాక్టర్ టీ. రాజరాజేశ్వరి వాలంటీర్లకు సూచించారు. నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు ఏఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో అడవి పాలెం గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ అడవి పాలెం గ్రామాన్ని ఎన్ఎస్ఎస్ దత్తత తీసుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు క్లీన్ అండ్ గ్రీన్, బ్లడ్ గ్రూప్, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. గ్రామంలో గుర్తించిన సమస్యలు పంచాయితీ దృష్టికి తీసుకురావాలని కార్యదర్శి ఎల్. హరి విష్ణు కోరారు. తడి, చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రత్యేక శిబిరం వారం రోజుల షెడ్యూల్ యూనిట్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం రామకృష్ణ వివరించారు. ఈ క్యాంపులో 50 మంది విద్యార్థులు ఏడు రోజులపాటు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, సభ్యులు పి శ్రీనివాసరావు, సిహెచ్ రవికుమార్, బి రామలక్ష్మి, కె. పార్థసారథి, వి. మన్మధరావు పి. జోష్న శ్రీ .డి ఎఫ్ సి రాణి, గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ శిరిగినీడి రంగారావు ,మండల తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, , బొలిశెట్టి రావులియ్య, అంతర్వేదివిఘ్నేశ్వర రావు, ఉండ్రాజవరపు బాబురావు కోలాటి వెంకట్రావు తదితరులు వాలంటీర్లు పాల్గొన్నారు.