పాలకొల్లు: జనవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడును, ఉప్పుటేరు ప్రాంతానికి చెందిన మొగల్తూరు రైతులు, గురువారం, స్థానిక క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. గత 50 ఏళ్లుగా, రైతులను పట్టిపీడిస్తున్న, ఉప్పుటేరు ముంపు సమస్యకు మంత్రి శాశ్వత పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయించారు. గొంతేరు డ్రైన్ పనులు పూర్తయి రైతులకు, ఎన్నో ఏళ్లగా ఉన్న కష్టాలు తీరాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కృతజ్ఞతలు మంత్రికి తెలియజేశారు. వారి కళ్ళల్లో ఆనందం చూసి మంత్రి ఉబ్బితబిబ్బయ్యారు. కూటమి ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తుందని తెలిపారు. డ్రైన్ పనులు సక్రమంగా జరిగాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు నిమ్మలను కొనియాడారు. తమ వెంట తెచ్చిన పళ్ళు, తాజా కూరగాయలు మంత్రికి అందజేశారు.
అభిమానం చాటుకున్న ఉప్పుటేరు రైతులు.
రైతులతో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల