అమరావతి: ఏప్రిల్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్)
అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ పీ ఆర్) తయారీ కి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నగరానికి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రవేశించడానికి 19 చోట్ల ఇంటర్ చేంజ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రహదారి పొడవు 190 కి.మీ. వరకు ఉంటుంది.
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో ఈ పరిధిలోకి వస్తాయి. యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే పద్ధతిలో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతారు. ఈ రహదారి ద్వారాకోల్కతా – చెన్నై హైవే,మచిలీపట్నం – విజయవాడ – హైదరాబాద్ హైవే తో పాటు
పలు రాష్ట్ర, జాతీయ రహదారులు అనుసంధానం చేస్తారు. మరో 2–3 నెలల్లో డి పి ఆర్ కు ఆమోదం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తైతే:
ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ బూస్ట్ తోఅమరావతి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
