అమరావతి: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
హోం శాఖ:గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు ‘అకడమిక్ భవనాలు’ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
న్యాయ శాఖ (కోర్టులు):
గౌరవ హైకోర్టు ప్రతిపాదించిన 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి, అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి,మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
3. పరిశ్రమలు & వాణిజ్యం (మైన్స్):
వడ్డెర సంఘాలకు క్వారీ లీజులు ప్రాధాన్య ఎంపిక, సినరేజీ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేయడానికి జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (అమరావతికి స్పష్టమైన చట్టబద్ధత): ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
జలవనరుల అభివృద్ధి
వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సరిగా పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. నిర్వాసితులకు విహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. జల వివాదాల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించింది. రైతులకు నిరంతరం నీటి సరఫరా జరగటానికి అవసరమైన పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రెవెన్యూ శాఖ:నెల్లూరు జిల్లా ప్రభుత్వ భూమిని పరిహార ఆటవీకరణ కార్యక్రమం కింద అటవీ శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది.
బ్రహ్మదేవం గ్రామంలో సి ఎస్ ఆర్ హాస్పిటల్ స్థాపన కోసం మార్కెట్ విలువ ప్రకారం భూమి కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
నంద్యాల జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇకోరెన్ ఎనర్జీ సంస్థకు భూ కేటాయింపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది
నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనేపల్లె లో2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ నంద్యాల అధ్యక్షులకు నంద్యాలలో టిడిపి కార్యాలయ భవనం నిర్మాణం నిబంధనల ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల్లో నిర్మిస్తున్న అల్ట్రా మెగా సోలార్ పార్కులకు సంబంధించిన భూ కేటాయింపులు సోలార్ పవర్ పాలసీ ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్లకు పూర్తిగా అమ్మేయకుండా కేవలం లీజు పద్ధతిలోనే ఇవ్వాలన్న నిబంధన ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంధన శాఖ:అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ & ఎండి అభ్యర్థన మేరకు, ఎడిసిఎల్ పనులకు ఏపీ సీపీ డిసిఎల్ వసూలు చేసే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్‌హెడ్ / సూపర్‌విజన్ చార్జీలను ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 2.5 శాతంకి తగ్గించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పౌర సరఫరాల శాఖ
పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే వంట గ్యాస్ కూడా ప్రస్తుతం కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా సమానమైన సబ్సిడీని వర్తింపజేయనున్నారు.
ఉన్నత విద్యా శాఖ:
ఉన్నత విద్యా శాఖ
రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ మరియు పర్యవేక్షణ కోసం ‘ది ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2026’ ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం లభించింది.
అమరావతి చట్టబద్ధతకు క్యాబినెట్ శ్రీకారం.
కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు