Skip to main content

Telugu News Power

విధి నిర్వహణకు వెళుతూ, తిరిగిరాని లోకాలకు హోం గార్డ్

హోం గార్డ్ వెంకటరమణ

పాలకొల్లు: ఏప్రిల్, 6 (తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక వెలమ గూడెం కు చెందిన రఘుమండ వెంకటరమణ(56) సోమవారం మరణించారు. పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా రాఘవ రాత్రి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉల్లంపూర్ వద్ద వేగంగా వస్తున్న కారు వెనకనుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. గాయపడిన వెంకటరమణ ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం ఆస్పత్రికి అక్కడ నుంచి విజయవాడకు తరలించారు చికిత్స పొందుతూ అసలు బాసొరు. వెంకట రమణకు, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు విచారణ జరుగుతున్నట్టు వివరాలు తెలియజేశారు. వెంకటరమణ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సంవత్సరం అంతగా పని చేసే వారని పోలీసులు పలు ప్రాంతాల నుంచి విచారం వ్యక్తం చేశారు.