Telugu News Power

అమరావతి రాజధాని సంబరాలు

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో అమరావతి సంబరాలు

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో శుక్రవారం రాజధాని అమరావతిని, అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిన సందర్భంగా, కళాశాలలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. అమరావతి రాజధానిగా అధికారిక గుర్తింపు పొందడం రాష్ట్ర అభివృద్ధికి అవకాశం కల్పిస్తుదన్నారు. ఈ నిర్ణయం పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణం ద్వారా రాష్ట్రానికి కొత్త ఉత్సాహం, అభివృద్ధి దిశలో వేగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, అధ్యాపకులు డాక్టర్ వి విజయలక్ష్మి,వి రమేష్, కే రోహిత్,ఫిజికల్ డైరెక్టర్ పి దుర్గారావు, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకొని సంబరాలను జరుపుకున్నారు.