Skip to main content

Telugu News Power

శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన.


పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ళ కల్యాణోత్సవాలు గత నెలలో ముగిసాయి. ఈ సందర్భంగా భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం జరిగింది. భక్తులు సు మారు 15 వేల వరకు ఈ మహా ప్రసాదాన్ని స్వీకరించారని, ఆలయ వర్గాలు అంచనా వేశాయి. ఈవో సతీష్ కుమార్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు, ధర్మకర్తలు, కొండేటి పుల్లారావు, మాడుగుల రవణమ్మ, కాంతారావు, చిప్పాడ రిషి, గంధం సుబ్బారావు, అమలాపురపు దేవి, వచ్చే ఒక ముట్టి ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్ వీరా శ్రీనివాసరావు, గవర శేషగిరి, కూటమి నాయకులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, సిడగం సురేంద్ర, కొమ్ముల దినేష్ అన్నదాన కార్యక్రమంలో సహకరించారు.