యలమంచిలి: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కాపులపాలెం, కుళాయి చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆదివారం పందిరి రాడు వేశారు. ఈ సందర్భంగా, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు అమ్మవారికి 4.59 లక్షల రూపాయల భూరి విరాళం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చివటపు నాగేశ్వరరావు, కాసా సత్య, వీరబాబు,బొప్పన రాంబాబు, శనగల శ్రీనివాస్, కొడవటి శివరామకృష్ణ, ఆకుల యేసు, కాసా ఆంజనేయులు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.