Telugu News Power

అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి మహర్దశ.

అభివృద్ధి పనుల శిలాఫలకం ఆవిష్కరణ
అరసవల్లిలో నిర్మించబోయే భవనాల ఆకృతులు

అరసవల్లి: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా, అరసవల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్ర అభివృద్ధికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి 4 కోట్ల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరపు అచ్ఛెం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ఇంద్ర పుష్కరిణి పునరుద్ధరణ పనులు ఈ ప్రాజెక్టులో ప్రముఖమైనదని తెలిపారు. భక్తుల కోసం వసతి గృహాలు, వంటశాలలో, విశాలమైన రహదారులు వంటి సౌకర్యాలు కల్పిస్తారన్నారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్ర అభివృద్ధికి నూతన శకం ప్రారంభమైందన్నారు.
అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
అరసవల్లి క్షేత్రానికి మహర్దశ తీసుకువస్తామని. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇంద్ర పుష్కరిణి ఊహ చిత్రం