Telugu News Power

ఆంధ్ర విశ్వ విద్యాలయం ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం.

ఆంధ్ర యూనివర్సిటీ మెగా ఫెస్ట్ గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న పవన్ కళ్యాణ్

మంగళగిరి: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కాం)
ఆంధ్ర విశ్వ విద్యాలయం మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కు క్యాంపు కార్యాలయంలో సోమవారం విశ్వవిద్యాయ అధికారులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మెగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల గోడ పత్రికను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్, యూనివర్శిటీ క్రీడా విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ మోహన్ , దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ పల్లవి, రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ శ్రీ కోటమరాజు శరత్ గారు పాల్గొన్నారు.