భీమవరం: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీరామనవమి పండగ సందర్భంగా, ఆకివీడు, పెదపేట రామాలయం ప్రవేశాన్ని అడ్డుకోవడం వెనుక కుట్ర కోణం ఉందని రాజ్యసభ సభ్యులు బాగా సత్యనారాయణ ఆరోపించారు. రామాలయం వద్ద జరిగిన ఘర్షణలో గాయపడ్డ జనసేన కార్యకర్తలను భీమవరం ఆస్పత్రిలో ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పురాతన దేవాలయాలకు చెందిన ఆస్తులను కాచేయడానికి ఈ ఘర్షణలు సృష్టించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిరాదనం గురైన, దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడానికి, మతమార్పిడి చెందిన అందరూ వ్యక్తులు, మత సంస్థలు ఈ కుట్రలు చేస్తున్నాయని వివరించారు. సమగ్ర విచారణ జరుగుతుందని ఎంపీ తెలిపారు. ఈ పర్యటనలో జనసేన నాయకులు గుండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆకివీడు పెదపేట రామాలయం ఘర్షణ వెనుక కుట్ర కోణం. -ఎంపీ పాకా సత్యనారాయణ ఆరోపణ.
గాయపడ్డ జనసేన నాయకులు పరామర్శిస్తున్న ఎంపీ పాక