
వీరవాసరం: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్ . కామ్)
సిండికేట్ల కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రొయ్యల రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయాలని పాలకొల్లు శ్రీ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, పాలకొల్లు ఏఎంసి చైర్మన్ గొట్టుముక్క గాంధీ భవన్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల భారీ సదస్సు ఆదివారం వీరవాసరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. సదస్సుకు పాలకొల్లు, ఆచంట, నరసాపురం తూర్పుగోదావరి, కృష్ణ తదితర జిల్లా నుండి రైతులు వేల సంఖ్యలో వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, సిండికేట్లుగా ఏర్పడి ఆక్వా రైతులను దోచుకుంటున్న, ఎగుమతి దారులు, దాణ తయారీ ఫ్యాక్టరీలు, సీడ్ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించడానికి వెంటనే కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపెడ అనుమతి లేకుండానే దాణ రేట్లు ఎలా పెంచుతారని వారు ప్రశ్నించారు. ఎగుమతి దారులు యుద్ధమని, ఏవో సాకులు చెప్పి కేజీకి 50 రూపాయలు ధరలు తెగించి ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. సీడ్ కంపెనీలు నాణ్యమైన సీడ్ రైతులకు ఇవ్వటానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దేశానికి అత్యంత విలువైన 70 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్చించి పెడుతున్న ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయన్నరకే యూనిట్ విద్యుత్తు అందజేస్తామని చెప్పిన ఇప్పుడు వరకు అమల్లోకి రాలేదన్నారు. ఆక్వా రంగంలో ఉపయోగించే సామాగ్రిపై సబ్సిడీ ఇవ్వాలని కోరారు. గత మూడు దశాబ్దాలుగా ఆక్వారంగానికి, అంతర్జాతీయ స్థాయి తీసుకువచ్చిన రైతుల పరిస్థితి ఇప్పుడు అప్పులపాలై, రమ్య గోచరంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను అష్టదిగ్బంధనం చేసి ఇబ్బందులు కాల్ చేస్తున్న సిండికేట్ గా వస్తాను నిర్మూలించడానికి, ప్రభుత్వానికి ఏప్రిల్ నెల వరకు గడువు ఇవ్వాలని ఈ సదస్సులో తీర్మానించారు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సదస్సులో మాజీ ఎంపీపీ వి. చంద్రశేఖర్, గాది
రాజు శ్రీనివాసరాజు, సజ్జ బుజ్జి, పెనుమత్స.రాంభద్రరాజు, తులసి రాంబాబు, మేడిది డేవిడ్ రాజు, అంగర విజయప్రసాద్, చిలుకూరు బాలాజీ, ఎస్. రామారావు, యువరాజు, మన్నే శ్రీనివాస్, హరిహర రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పడమట మా ఊవుళ్ళు, మల్లికార్జున రావు, తదితర వేల మందిరైతులు పాల్గొన్నారు.