Skip to main content

Telugu News Power

కేంద్రమంత్రి మాట నీటిమటేనా నర్సాపురం పై రైల్వే శీతకన్ను

విజయవాడ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి గోపిరాజు శ్రీనివాస్ వర్మ, పలు రైళ్లు ప్రత్యేక రైళ్ళుగా నడుస్తున్న సందర్భంగా, వాటిని రెగ్యులర్ అధిపతిగా నడుపుతామని ప్రకటించారు. మ
ఈ మేరకు రైల్వే అధికారులతో చర్చించినట్టు తెలిపారు. అధికారులు మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నర్సాపురం నుంచి చర్లపల్లి మీదుగా బెంగళూరుకు నడుస్తున్న రైలు నిలిపివేసినట్టు ప్రకటించారు. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం వేసిన రైలు కూడా ఆగిపోయింది. ప్రతి ఆదివారం రాత్రి గం 8 లకు నరసాపురం నుంచి చర్లపల్లి వెళ్లే రైలు నిలిచిపోయింది. నర్సాపురం నుంచి కె ఎస్ ఆర్ బెంగళూరు నడిచే ఎక్స్ప్రెస్ రైలు కూడా రద్ధుల పద్దులో పడింది. స్థానిక ఎంపీ ఫోర్త్ ప్రజలకు రైలు సౌకర్యాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రైల్వే శాఖతో చర్చలు జరిపి రైలు కొత్తగా ప్రవేశపెట్టారు. కొన్ని రైళ్ళు
పొడిగించారు. ఈ నేపద్యంలో ఇచ్చిన హామీని రైల్వే శాఖ తరచూ పెట్టడం,స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఇన్చార్జిగా తలమునకలై ఉన్నారు. మంత్రి వెంటనే ఈ రైలు పునరుద్ధరణకు కృషి చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.