Telugu News Power

ఆక్వా రైతుల నష్ట నివారణకు 21 వరకు గడువు. -జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయం.

ఆక్వా రైతు అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతున్న దృశ్యం
సమావేశంలో పాల్గొన్న రైతులు

పాలకొల్లు: మార్చి ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షత వహించారు. దాణ ధరలు తగ్గింపు, రొయ్యల కొనుగోలుపై ధరల పెంపు విషయంలో ఈనెల 21 లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాణా ధరలు కేజీకి నాలుగు రూపాయలు పెంపుతో రైతులను ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధం బూచి చూపి రొయ్యల కొనుగోలుపై కేజీకి 50 రూపాయలు తగ్గింపు వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈనెల 21న తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో సమావేశమై, ఆయా కొనుగోలుదార్ల ప్రాసెసింగ్ యూనిట్లను, మేత తయారీ యూనిట్లను బహిష్కరించే నిర్ణయం తీసుకుంటామన్నారు. నెల 25న ఇందుకు సంబంధించి భారీ కార్యక్రమం మూడు జిల్లాల రైతులు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రాసెసింగ్ యూనిట్లు భయపెట్టడం వల్ల, ధర తగ్గిపోతుందని, ఇప్పటికే రైతులు సరుకు ఆయన కాడికి అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో నా రైతులు పాల్గొన్నారు.