విజయవాడ: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం అత్యంత ఆధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి చేస్తారు, రాత్రి వేళల్లో క్రీడలు నిర్వహించడానికి రెడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారు. వర్షం పడినప్పటికీ నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ నిర్మిస్తారు. క్రీడా అభిమానుల కోసం గ్యాలరీ సౌకర్యాలు మెరుగుపరుస్తారు. సర్వాంగ సుందరంగా ఈ స్టేడియం తీర్చిదిద్దటానికి పనులు ప్రారంభమయ్యాయి.
