Telugu News Power

ఇద్దరమ్మాయిలు కు గ్రూప్-2 లో విజయం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు వాస్తవ్యులు, గురుజు దివాకర్, కుమార్తె లక్ష్మీ అంజన, గ్రూప్-2 పోటీ పరీక్షలో విజయం సాధించారు. ఈమె, పోలీస్ శాఖలో డి.ఎస్.పి ఉద్యోగానికి ఎంపికయ్యా. ప్రస్తుతం వీరు పాలకొల్లులో ఉంటున్నారు. తండ్రి దివాకర్, భీమవరం సి ఐ కార్యాలయంలో రైటర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి హేమలత ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు. ఈమె తాతగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసారు. ఈ సందర్భంగా, పెదనాన్న, ఈనాడు మాజీ విలేకరి, గురుజు శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, పి ఏ హనుమ, తదితరులు అభినందనలు తెలియజేశారు.
స్థానిక,కొంచాడ చిన్ని మౌనిక, గ్రూప్ -2, పరీక్షలో సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమె బాపట్ల ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో, బీఎస్సీ, అగ్రికల్చర్ చదివారు. జిల్లా కేంద్రం, భీమవరం కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈమె వయస్సు 25 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులో, పెద్ద ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు, తూర్పు కాపు, విద్య విజ్ఞాన అభివృద్ధి సంఘం వారు మౌనికను అభినందించారు. ఈ కార్యక్రమంలో లోపింటి చిరంజీవి, గేదెల వాసు, ధనాని ప్రకాష్, కోరాడ శ్రీనివాస్, ఎడ్ల సత్యనారాయణ, సిగడగం వాసు, మజ్జి శ్రీనివాస్, కోరాడ సూరిబాబు, పిల్ల మోహన్, తదితరులు పాల్గొన్నారు.

భీమవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రైటర్ పనిచేస్తున్న తండ్రి గురుజు దివాకర్ తో డీఎస్పీగా గ్రూప్ లో డిఎస్పీగా ఎంపికైన లక్ష్మీ అంజనఫోటో దృశ్యం