Telugu News Power

ఈఏపీ (ఎంసెట్) సెట్ గడువు పొడిగింపు.

విజయవాడ: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సాంకేతిక కోర్సుల్లో చేరేవారికి గడువు పొడిగించారు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తులు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు,2 వేల ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు, 4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు, 10 వేల ఆలస్య రసుముతో ఏప్రిల్ నెల మూడో తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించారు.
ప్రవేశ పరీక్షలు మే నెల 12 నుంచి 15 వరకు, 18 నుంచి 20 వరకు నిర్వహిస్తారు.