Telugu News Power

ఈనెల 22న ఆక్వా రైతుల ఉద్యమ శంఖారావం.

పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. స్థానిక పూలపల్లి కళ్యాణ మండపంలో గురువారం, సంఘ సమావేశం గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈనెల 22న ఉభయగోదావరులు, కృష్ణాజిల్లా ఆక్వా రైతులతో భారీ సభ జరపనున్నట్లు వెల్లడించారు. కొన్నిసార్లు తమ సమస్యలు తీసుకువచ్చినప్పటికీ, పరిష్కారం కాలేదు అన్నారు. యుద్ధం ముసుగులో కేజీకి 50 రూపాయల ధర తగ్గించడం, మేత ధర కేజీకి నాలుగు రూపాయలు పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులను దోచుకుంటున్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ ఫ్యాక్టరీలను బహిష్కరించాలన్నారు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్ల రైతులు ధర వచ్చినపుడు అమ్ముకోవడానికి వీలవుతుందన్నారు. ఈ సమస్య వల్ల దళారులు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారన్నారు. విద్యుత్ యూనిట్ రేటు గతంలో వలె రూపాయిన్నకు ఇవ్వాలని కోరారు. వేసవిలో రెండు నెలల పాటు, చెరువులకు నీళ్లు లేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని, చెరువులు వేయకుండా, శుభ్రం చేయడానికి ప్రభుత్వం జీవో తీసుకురావాలన్నారు. అందువల్ల మంచి సీడు కూడా లభిస్తుందన్నారు. నుంచి దాదాపు పదివేల మంది ఆక్వా రైతులతో జరిగే ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.