Telugu News Power

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

ఈవీఎం గోడౌన్ తణిఖీ చేస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రపరచు గొడౌన్ శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరిశీలించారు.
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేసారు. గోదాములో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అలారం వ్యవస్థలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోని ప్రత్యక్షంగా సమీక్షించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.