అనకాపల్లి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్)
అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం లో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇది చారిత్రాత్మక ఘట్టం. పారిశ్రామిక రంగంలో కీలక మైలురాయిగా నిలిచే మరో భారీ ప్రాజెక్ట్‌కు అనకాపల్లి వేదికైంది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణం. ప్రముఖ ఉక్కు సంస్థ అర్సలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా చేపడుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ దేశ పారిశ్రామిక స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో అమలు కానుంది. మొదటి దశలోనే సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది దేశ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ,మరియు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ‘వికసిత భారత్’ దిశగా నడిపే ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌కు కీలక పాత్ర కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.లక్ష్మీ మిట్టల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనకాపల్లి ప్రజలతో కలిసి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ పారిశ్రామిక పటంలో ముందంజలో నిలబెట్టడమే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేయనుంది. ఈ ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా, క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం వల్ల
6 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఓ పక్క ఫార్మా, మరోపక్క భారీ డేటా సెంటర్, ఇప్పుడు తయారీ రంగానికి సంబంధించి ఉక్కు పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని సమగ్రంగా మార్చివేయనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఉక్కు పరిశ్రమతో లక్ష మందికి ఉద్యోగాలు.