Telugu News Power

ఉడాన్ కేఫ్ ఏర్పాట్లపై మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు.

అమరావతి: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్.కామ్)
రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ పొడపాటి తేజస్వి, విమానాశ్రయాల్లో తినుబండాల ధరలు తగ్గింపు పై, కేంద్ర పౌర విమాన శాఖామాత్యులు కింజరపు
రామ్మోహన్ నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన చూపుతున్న నాయకత్వం, మనసున్న పాలనకు అద్భుత నిదర్శనమన్నారు. ఉడాన్ యాత్రి కేఫేలను ప్రారంభించడం ద్వారా సాధారణ ప్రజల సమస్యను సౌకర్యంగా మార్చారు. కేవలం రూ.10కి టీ, రూ. 20కి తినుబండారాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఏ ప్రయాణికుడైనా తన బడ్జెట్ గురించి ఆందోళన చెందకుండా విమానాశ్రయంలో ఆకలితో ఉండకుండా చూసారు.
ఇది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు; ఇది గౌరవం, శ్రద్ధ, సమానత్వానికి ప్రతీక. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది ప్రయాణికుల విమాన ప్రయాణ అనుభవాన్ని మరింత మానవీయంగా మార్చుతున్నారు.
మీ దూరదృష్టి పౌర విమానయాన రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోంది. మీలాంటి సానుభూతి గల నాయకత్వం నుంచి ఇంకా ఎన్నో మంచి మార్పులు రావాలని మేమందరం ఆశిస్తున్నామని తేజస్వి కృతజ్ఞతలు తెలిపారు.