Telugu News Power

ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త.

ఎంపీ రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారు.

గుణుపూర్–విశాఖపట్నం
(58505/06)ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద,
(8525/26) బెరహంపూర్–విశాఖపట్నం (8525/26) ప్యాసింజర్ రైలు మందస రోడ్ వద్ద, 18117/18 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18117/18) రైలు పాతపట్నం వద్ద ఆగుతాయి. ఈ హల్ట్ ల ద్వారా జిల్లాలోని అంతర్గత ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరియు విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి మరియు వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుంది. తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున నాయుడు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కొత్త స్టాపేజీల ద్వారా జిల్లాలో మెరుగైన రైల్వే కనెక్టివిటీ మరియు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరేలా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు.