
పాలకొల్లు: మార్చి, 6(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక లైయన్స్ క్లబ్ హాలులో,శుక్రవారం ఉద్యమి సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్, చైర్మన్, ఉద్యమి సమన్వయకర్త, చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి పలువురు సాధకులు హాజరయ్యారు. జనసేన పార్టీ సభ్యత నమోదు ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు పెంచడానికి, వేగవంతం చేయడానికి పలుసలహాలు శ్రీనివాసరావు సూచించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నిర్వహిస్తున్న ఉద్యమి కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కలుసుకొని స్వయంగా శ్రీనివాసరావు సభ్యత్వ నమోదు చేశారు. భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, బండి రమేష్, ఏపీ ఐ ఐ డి సి, సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.