Telugu News Power

ఉద్యోగిని పై దాడిని ఖండించిన సంఘ నాయకులు.

పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘ నాయకులు.

పాలకొల్లు:ఫిబ్రవరి,2 (తెలుగు న్యూస్ పవర్) విధి నిర్వహణలో ఉన్న పరిసరాలు،పరిశుభ్రం కార్యదర్శి షేక్ షకీనా పై సోమవారం దాడి జరిగినట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్థానిక కోడి గట్టు, సచివాలయం-2 విధులు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ నోటీసు అందచేయటానికి అందజేయడానికి మసీదు సెంటర్లో ఉన్న ఒక షాపు వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా,కార్యదర్శి షకీనా పై ఎం. శ్రీనివాస్, ధనలక్ష్మి అనేవారు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, పాలకొల్లు తాలూకా యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు షేక్ ఉమర్ అలీషా, తాలూకా అధ్యక్షులు, వి సునీల్ కుమార్, మంతెన నారాయణరాజు, కార్యదర్శి రామకృష్ణ, రాజకుమారి, శివ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.