Skip to main content

Telugu News Power

మావుళ్ళమ్మకు భక్తులు బంగారం బహుకరణ.

మాఊళ్ళమ్మకు బంగారం కానుకగా సమర్పిస్తున్న భక్తులు

భీమవరం: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్)
భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి, ఎనిమిది గ్రాముల బంగారం, (లక్షా పదివేల రూపాయలు) వాడపల్లి వాస్తవ్యులు పున్నం నూకరాజు, షణ్ముఖ సూర్య దుర్గ దంపతులు సోమవారం, అమ్మవారికి కానుకగా సమర్పించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, పూజలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం, అమ్మవారి చిత్రం, ప్రసాదాలు అందజేశారు. ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.