ఉండి: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) ఉప సభాపతి, స్థానిక ఎమ్మెల్యే, కనుమూరి రఘురామకృష్ణ రాజు పై ఉండి మండలం, వెలివర్రు గ్రామ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వర రాజు, అలియాస్ బుడ్డియ్య రాజు చేసిన తీవ్రమైన, అనుచిత వ్యాఖ్యలను పత్రికా సమావేశంలో కల్లేపల్లి సతీష్ రాజు తీవ్రంగాఖండించారు.
నియోజకవర్గ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టు సతీష్ రాజు తెలిపారు. బుడ్డియ్య రాజు ఉన్మాదిగ మారి ఆధారాలు లేని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, తీవ్రంగా ధ్వజమెత్తారు. రఘురామ కృష్ణంరాజు, అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చారని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు తన అసత్య ఆరోపణలతో మానసికంగా ఇబ్బంది పెడుతున్న బుడ్డియ్యరాజు పిచ్చాసుపత్రిలో చేర్పించాలని హితవు పలికారు. గతంలో మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు, వివాదాస్పదం కావడంతో ఆ పదం నుంచి తొలగించారని వెల్లడించారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలలోకూడా రఘురామరాజు సదుద్దేశంతో దూరంగా ఉన్నారని తెలిపారు. స్థానికనాయకులతో కలిసి, ،ఉండి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సతీష్ రాజు۔తీవ్రంగా ఖండించారు.
ఉపసభాపతి పై ఆరోపణలు తీవ్రంగా ఖండించిన సతీష్ రాజు.
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సతీష్ రాజు