Telugu News Power

ఉపాధి హామీ 200 రోజులకు పెంచాలి.

ఉపాధి హామీ 200 రోజులు పెంచాలని ధర్నా

యలమంచిలి: ఫిబ్రవరి, 2(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం 200 రోజులకు పొడిగించాలని, కనీస వేతనం 600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఐద్వా , సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఏనుగువానిలంక, చించినాడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు దేవ సుధాకర్, సిపిఎం నాయకులు మాచవరపు సుబ్బారావు, ఐద్వా నాయకురాలు జయప్రద, పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.