Telugu News Power

ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశం

క్లస్టర్ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ

యలమంచిలి: డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పపర్) విద్యాశాఖ ఆదేశాల మేరకు యలమంచిలి మండలంలో శనివారం క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల కార్యాచరణ పై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రణాళిక అమలు చేయటానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంఈఓ రామకృష్ణ రాజు కోరారు. మేడపాడు క్లస్టర్లో ఎంఈఓ ఏ శ్రీవాణి పాల్గొన్నారు. యమంచిలి, చించినాడ,మేడపాడు, దొడ్డిపట్ల క్లస్టర్లకు సిహెచ్ వి సురేష్ బాబు, ఎం సీతారామయ్య, ఎం వెంకట సత్యనారాయణ, ఆర్ సత్యనారాయణ చైర్మన్లు సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రాంబాబు, మహమ్మద్ లియాకత్ ఆలీ, ఎస్ ఎస్ వి అవధాని, ఎన్ విజయానంద్, కే రాధిక రాణి, ఎం ఉమా, ఏ దేవేంద్రుడు పాల్గొన్నారు.

క్లస్టర్ సమావేశంలో సూచనలిస్తున్న ఎంఈఓ రాజు