Telugu News Power

ఎట్టకేలకు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు హాజరు.

ఎంపీ రఘురామ కేసులు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్

గుంటూరు: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన నాయక్, మహారాష్ట్ర కోర్టు ఆదేశాలతో విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏపీ పోలీసులు ముంబై నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఆ తదుపరి పటిష్టమైన చర్యలతో సునీల్ నాయకులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించలేదు. సుమారు 7 ఏడు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం సునీల్ నుంచి లభించలేదని తెలియవచ్ఛింది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి కొనుమూరి రామకృష్ణంరాజు కస్టడీ టార్చర్ కేసుకు సంబంధించి ఈ విచారణ జరుగుతుంది. ఈ కేసులో కీలక సూత్రధారులు ఎవరనేదాని గురించి తీవ్ర ప్రయత్నాలు విచారణ సంస్థలు చేపట్టాయి. కృష్ణంరాజు కస్టడీ టార్చర్ కు సంబంధించి, పలుమార్లు సునీల్ నాయక్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు స్పష్టమైన ఆధారాలు విచారణ సంస్థ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ సునీల్ నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టలేకపోయారు. కోర్టు వారి ఆదేశాల మేరకు ఈ నెల 9 వరకు ఈ విచారణ కొనసాగుతుంది. , ఈ అంశం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. రఘురామ, వారి బృందం ఈ పరిణామాల పట్ల ఉత్సాహంగా ఉంది.

గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్ద సునీల్ నాయక్