రాజోలు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) రాజోలు భారతీయ స్టేట్ బ్యాంక్, గోల్డ్ లోన్ కుంభకోణం బాధితులకు నగదు ఉపశమనం కలిగిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దేవర ప్రసాద్ బుధవారం వెల్లడించారు. కుంభకోణం, ఆధారాలు సేకరించడానికి, విచారించడానికి,సిబిఐ కి సుదీర్ఘకాలం పట్టనుంది. ఈ సందర్భంగా, బ్యాంకు, గోల్డ్ లోన్ బాధితులకు, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, వారి బంగారానికి బదులు, నగదు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ ప్రకటించారు.
ఎస్బిఐ గోల్డ్ లోన్ బాధితులకు ఊరట
ఎమ్మెల్యే దేవ వరప్రసాద్