Telugu News Power

ఏఎస్ఎన్ఎం కాలేజ్ విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ప్రాక్టికల్స్

డ్రోన్ శిక్షణ ప్రాక్టికల్ లో విద్యార్థినులు

పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్, టు మరియు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహిస్తున్న ఐదు రోజుల ఏరియల్ డ్రోన్ పైలెట్ ట్రైనింగ్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో మూడవ రోజు డ్రోన్ పైలెట్లు పి దుర్గాప్రసాద్, వి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో బాలికలకు డ్రోన్ ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు స్వయంగా డ్రోన్‌ను ఆపరేట్ చేస్తూ, టేక్ ఆఫ్, ల్యాండింగ్, ఎత్తు నియంత్రణ, దిశ మార్చడం, జీపీఎస్ ఆధారిత నావిగేషన్ వంటి అంశాలను ప్రత్యక్షంగా అభ్యసించారు. నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టికల్ సెషన్ నిర్వహించారు. విద్యార్థినిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాక్టికల్ అనుభవం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందిందని పాల్గొన్న విద్యార్థినులు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ, ఇటువంటి స్కిల్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు బాలికలకు ఆచరణాత్మక జ్ఞానం అందించి స్వయం ఉపాధి, స్టార్ట్-అప్ అవకాశాలకు మార్గం చూపుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని,తెలుగు విభాగాధిపతి డా. బి. వెంకట స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. రామకృష్ణ, డా. వి.డి.వి. విజయలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ సి హెచ్ ఉషారాణి,ఏ. వంశీ సుబ్బరాయన్,జీడి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్లు డి మన్మధరావు, పి. జ్యోత్స్న శ్రీ, డి. హెప్సి రాణి తదితర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.