ఆత్రేయపురం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఏడువారాల వెంకటేశ్వరుని, స్థిర వారం ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు భక్తులు సమర్పించుకున్నట్టు దేవాదాయ వర్గాలు తెలిపారు. వేద ఆశీర్వచనం,1,116 రూపాయల టికెట్ ద్వారా ఈ ఆదాయం లభించింది. వీరికి ఇకనుండి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. ఇకనుంచి వి ఐ పి లు కూడా 200 రూపాయల టికెట్ అనివార్యంగా కొనవలసి ఉంటుంది. సిఫార్సులను దూరంగా ఉంచడానికి,250 మంది ఉద్యోగుల సెల్ ఫోన్లు ఆఫీసులో భద్రపరుస్తారు. కేవలం 5 మంది ఆలయ ఉద్యోగుల దగ్గర మాత్రమే సెల్ఫోన్లో ఉండటానికి అనుమతి ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. భక్తులు పదివేల విరాళం సమర్పిస్తే, వారికి వేద ఆశీర్వచనం తో పాటు స్వామివారి జ్ఞాపిక బహుకరించాలని నిర్ణయించారు. ఫీవర్ బాధ్యతలు స్వీకరించిన ఆలయ ధర్మకర్తల మండలి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముదునూరి వెంకటరాజు అధ్యక్షతన, ధర్మకర్తల మండలి భక్తుల సౌకర్యార్థం మరిన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలియ వచ్చింది.
ఏడువారాల వెంకటేశ్వరుని ఈ ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు.
వాడపల్లి ఏడువారాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం